విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యత : ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి

by Aamani |
విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యత : ఎమ్మెల్యే  పర్ణిక రెడ్డి
X

దిశ,నారాయణపేట ప్రతినిధి : ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన విద్య,వైద్య సేవలు అందించేందుకు మొదటి ప్రాదాన్యత ఇస్తానని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణం, మరికల్, దామరగిద్ద, కోయిలకొండ మండలంలో బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం లాల్ మస్జిద్ స్కూల్ లలో ఎమ్మెల్యే విద్యార్థిని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్స్ లను పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. పాఠశాలల్లో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. చైర్ పర్సన్ గందె అనసూయ చంద్రకాంత్, డీఈవో అబ్దుల్ ఘని, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు యూ. మహేష్, సలీం, శిరీష, అమీనుద్దిన్, సరిత, నాయకులు బండి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed