దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Disha Web Desk 11 |
దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: ఆయా పనుల నిమిత్తం దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లో ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. దివ్యాంగుల పెన్షన్ కై సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. సదరం క్యాంప్ ప్రతి బుధవారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ధరణి సంబంధిత సమస్యల పరిష్కారాన్ని కై మీసేవలో అప్లై చేసుకునే విధానాన్ని వివరించారు.

ఎలాంటి సమస్య ఉన్న తహసిల్దార్ కార్యాలయం, లేదా నేరుగా తనను సంప్రదించాలన. సమస్యలను పరిష్కరించడనికి అధికారులు సిద్ధంగా ఉన్నారని దళారుల చేతులో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023 కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మరియు వివిధ గ్రామాల సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జ్యోతి, పర్సనల్ సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్, ఏవో నర్సింగరావు, డీపీఓ మురళి, ఐదు మండలాల ఎంపీడీవో ,ఎంపీవో, సర్పంచులు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed