ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రత.. ఎస్పీ నరసింహ

by Javid Pasha |
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రత.. ఎస్పీ నరసింహ
X

దిశ, మహబూబ్ నగర్: రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలోని 15 పోలింగ్ స్టేషన్లకు గాను 12 రూటల్లో 5 స్ట్రైకింగ్ ఫోర్సులు, ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తో మొత్తం 147 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్,జ డ్చర్ల టౌన్, బాలానగర్ పోలింగ్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. డిఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed