డిప్యూటీ సీఎం పవన్ చాంబర్ రెడీ.. నెంబర్ ఎంతంటే...!

by srinivas |
డిప్యూటీ సీఎం పవన్ చాంబర్ రెడీ..  నెంబర్ ఎంతంటే...!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఇక జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మంత్రి పదవులు దక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు ఖరారయ్యారు. కానీ ఇప్పటివరకూ బాధ్యతలు చేపట్టలేదు. ఈ నెల 19న ఆయన డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు ఏపీ సెక్రటేరియట్‌లో చాంబర్ కేటాయించారు. సచివాలయం రెండో బ్లాక్‌‌ మొదటి అంతస్తులో 212వ రూమ్‌ను పవన్ కల్యాణ్‌కు అప్పగించనున్నారు. ఈ రూమ్‌లోనే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక పవన్ కల్యాణ్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా అదే అంతస్తులో పవన్ కల్యాణ్ పక్కన వరుస రూములను కేటాయించారు. పవన్ కల్యాణ్ కే కేటాయించిన చాంబర్‌లో గత ప్రభుత్వం వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్‌కు కేటాయించింది. తనకు కేటాయించిన చాంబర్‌పై ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు సమాచారం అందజేశారు. పవన్ కల్యాణ్ ఛాంబర్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు ఉంటారు. రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం ఉంటారని అధికారులు తెలిపారు.Next Story

Most Viewed