క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది: ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి

by Disha Web Desk 11 |
క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది: ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: చదువు మాదిరిగానే క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్, జడ్పీ చైర్ పర్సన్ వనజ, మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, ఎస్పీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ముందుగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు గాను క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని అంతేకాకుండా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయిలో రాణించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా క్రీడాకారులతో కబడ్డీ ఆడారు. ధన్వాడ మండలం బుడ్డమోని తండా కు చెందిన సర్పంచ్ అందించిన స్పోర్ట్స్ డ్రెస్ లను క్రీడాకారులకు అందించారు. వాలీబాల్ పోటీలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. క్రీడా పోటీలకు తమ వంతుగా ఎమ్మెల్యే రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ కృష్ణమాచారి, పద్మ నళిని, సాయినాథ్ తో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed