కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో నాయకుల ఘర్షణ..

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో నాయకుల ఘర్షణ..
X

దిశ,గద్వాల ప్రతినిధి : గద్వాల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ లో నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకరికి ఒకరు తోపులాడడం తో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. వివరాలకు వెళితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాల్ నియోజకవర్గం లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మల్దకల్ మండల కేంద్రం లో పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.

ర్యాలీ లో ప్రచార రథం కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్ర శేఖర్ రెడ్డి ఎక్కుతుండగా స్థానిక నాయకులు పెద్దొడ్డి రామ కృష్ణ అతని అనుచరులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ని ఎక్కకుండా నిలువరించారని,ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఇద్దరు తోపులాడుకోవడం జరిగింది. కావాలనే పథకం ప్రకారం తనపై దాడి చేసి కొట్టారని చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో గద్వాల్ ఏరియా ఆసుపత్రి కి ఆయనను తరలించి చికిత్స అందించారు. అసెంబ్లీ ఎన్నికలు ముందు నాయకులు అంత కలిసి గద్వాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గద్వాల్ అభ్యర్థి సరితా తిరుపతయ్య స్వల్ప మెజారిటీతో ఒడి పోవడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత గద్వాల్ కాంగ్రెస్ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు.


Next Story

Most Viewed