అనిరుద్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

by Disha Web Desk 11 |
అనిరుద్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
X

దిశ, జడ్చర్ల : టిపిసిసి ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో చేపడుతున్న ప్రజాహిత పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో పలువురు గాయపడిన ఘటన ఆదివారం జడ్చర్ల మండలంలోని నసురుల్లబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో గ్రామంలోని దళితుల భూమిని సర్పంచ్ కబ్జా చేశాడని ఆరోపించడంతో, గ్రామంలోని అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. ఇరువర్గాలు గ్రామంలో ఎదురెదురుగా తరసపడడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర మండలంలోని నసరుల్లాబాద్ గ్రామానికి చేరుకుంది. కాగా గ్రామంలోని దళితులకు చెందిన 19 గుంటల భూమిని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ కబ్జా చేశారని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ ప్రణీత్ చందర్ తో సహా పలువురు కార్యకర్తలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వైపు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే స్థాయిలో స్పందిస్తూ ఎదురెళ్ళారు. ఈ క్రమంలోనే ఇరువురు పెద్దపెద్ద కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు.




దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి పై కూడా దాడి చేసేందుకు విఫలాయయత్నం చేశారు. ఈ తోపుడాటలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అవడంతో పాటు గ్రామ సర్పంచ్ ప్రణీత్ చందర్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి .అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తన పాదయాత్రను అడ్డుకునేందుకే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రపూరితంగా కర్రలతో దాడికి దిగారని ఆయిన కూడా తాము శాంతియుతంగా ఉన్నామని తదుపరి చర్యలు పోలీసులే తీసుకుంటారని, బీఆర్ఎస్ పార్టీ కవ్వింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ప్రజల ఆశీర్వాదంతో పాదయాత్ర పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అనిరుద్ రెడ్డి అన్నారు...



తనపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో చేతికి అయినా గాయాన్ని చూపిస్తున్న సర్పంచ్ ప్రణీత్ చందర్

కాంగ్రెస్ పార్టీ లూ కార్యకర్తలు 200 మంది ఏకకాలంలో తమ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు దిగారని అసత్య ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తమ గ్రామంలో 19 గుంటల భూమిని కబ్జా చేశానని అనిరుద్ రెడ్డి అసభ్య పదజాలంతో ఆరోపిస్తూ రెచ్చగొడుతున్నారని అనిరుద్ రెడ్డికి దమ్ముంటే తాను 19 భూమి ఎక్కడ కబ్జా చేసానో నిరూపించాలని సర్పంచ్ ప్రణీత్ చందర్ అన్నారు.




Next Story

Most Viewed