మానోపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. బయటపడ్డ అంతర్గత విబేధాలు..

by Disha Web Desk 11 |
మానోపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. బయటపడ్డ అంతర్గత విబేధాలు..
X

దిశ, మానోపాడు: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు మండలాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశాలలో అంతర్గత విభేదాలతో కోల్డ్ వార్ మొదలైంది. జోగులంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఒక్కసారిగా సభ గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి చర్చించకుండా ఒకరిపై మరొకరు అనవసరమైన ఆరోపణలు చేసుకోవడం సరికాదని ఎమ్మెల్యే అబ్రహం నాయకులకు సూచించారు.

మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, ఆసరా తదితర అద్భుతమైన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందన్నారు. బీఆర్ఎస్ కుటుంబంలో అందరం కలిసి కట్టుగా ఉండాలని, సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉండి కిసాన్ దేశ్ గా మార్చాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అందరూ ఒక్కతాటిపై నడవాలని చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లెపాడు శంకర్ రెడ్డి ఎమ్మల్యేను పలు సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేశాడు. దీంతో సభలో ఉన్న కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా సభ పైకి దూసుకొచ్చారు.

ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని గందరగోళం చేశారు. దీంతో జడ్పీ చైర్మన్ సరిత జోక్యం చేసుకొని మనలో మనం గొడవలు పడే విధంగా మాట్లాడుకుంటే సమ్మేళనంలో మన పరువే పోతుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు అలంపూర్ లో పార్టీనీ ముందుకు నడిపించామని, ఆత్మీయ సమ్మేళనం అంతర్గత సమ్మేళనంలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story