కాంగ్రెస్ కార్యకర్తల పై బీఆర్ఎస్ నాయకుల దాడి..

by Kalyani |
కాంగ్రెస్ కార్యకర్తల పై బీఆర్ఎస్ నాయకుల దాడి..
X

దిశ, గద్వాల : ప్రస్తుతం జరుగుతున్న గద్వాల అసెంబ్లీ రాజకీయాలు రోజురోజుకు భయానక వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ తత్వం నెలకొనడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో సోమవారం ఉదయం కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడులు కొనసాగాయి. దాడుల్లో గాయపడిన అశోక్ ను చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శివన్న కుమారులు అశోక్, సత్తన్న లపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అకారణంగా దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులు శివన్న, కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్, ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, దాడుల వెనుక బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. ప్రజల్లో భయానక వాతావరణాన్ని నెలకొల్పడం సరికాదని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.Next Story

Most Viewed