ఘనంగా తిక్క విరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 12 |
ఘనంగా తిక్క విరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
X

దిశ, అయిజ: మండలం లో వెలసిన శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమైయ్యాయి. ప్రతి సంవత్సరం స్వామి వారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

స్వామి వారి రథోత్సవం వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారి రథోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాతర బ్రహ్మోత్సవాలు 10 నుంచి మార్చి 21 వరకు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు, రైతు సోదరుల అన్నదానం కార్యక్రమం, భజన పోటీలు, రైతు సంబరాలు, కుక్కల పోటీలు, పొట్టేళ్ల పందెం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ టీమ్ కామెడీ షోలు, నిర్వహిస్తున్నామని ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయిజ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed