పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో మెరుగైన పాలన: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో మెరుగైన పాలన: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో పాలన మరింత మెరుగైందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు నాలుగేళ్ల పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. గ్రామీణులకు ప్రభుత్వ పథకాలను మరింత దగ్గర చేసి తమవంతు పాత్ర పోషించాలని కార్యదర్శులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు తమకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు సంవత్సరాల అనంతరం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి తమను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యేని కోరడంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పంచాయతీ కార్యదర్శులు కోరారు.

అంతకుముందు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పోచమ్మ టెంపుల్ దగ్గర కోటి రూపాయలతో చేపట్టనున్న నూతన సీసీ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం దాత సహాయంతో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ కమాన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గంగపూర్ లో పర్యటించారు. గ్రామంలో నిర్మించిన స్మశానవాటికను ప్రారంభించారుజ. కొత్తగా నిర్మించబోయే బీసీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వసతులు మెరుగయ్యాని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడలు యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్మన్ సారిక, స్థానిక కౌన్సిలర్ కుమ్మరి రాజు, మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ షేక్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్, చైతన్య చౌహన్, జ్యోతి, ఉమా శంకర్ గౌడ్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed