సమస్య ఏది ఉన్న తక్షణమే నా దృష్టికి తేవాలి : ఎమ్మెల్యే

by Kalyani |
సమస్య ఏది ఉన్న తక్షణమే నా దృష్టికి తేవాలి : ఎమ్మెల్యే
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ పాఠశాల విద్యాభివృద్ధి పై నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అచ్చంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో గురువారం డీఈవో గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులైన తాగునీరు, టాయిలెట్లు అలాగే అవసరమైన చోట నూతన పాఠశాల భవనాలు నిర్మాణం చేయుటకు సంబంధించిన విషయాలను ఒక నివేదిక రూపంలో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ ల ద్వారా నా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేసి విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.

అంతకుముందు సావిత్రిబాయి పూలే, సరస్వతి విగ్రహాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, హెచ్ఎంలు జిహెచ్ఎంలు ఎస్ ఓ, ఎంఈఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.Next Story

Most Viewed