హామీ ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేస్తాం : ఎమ్మెల్యే కసిరెడ్డి

by Kalyani |
హామీ ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేస్తాం : ఎమ్మెల్యే కసిరెడ్డి
X

దిశ, చారకొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన పథకాలన్ని అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అభిప్రాయాల పరిగణనలో భాగంగా రైతు పంట పెట్టుబడి సహాయంగా విడత కు రూ.7500 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు 15 లోపు ఒకేసారి రైతు ఋణ మాఫీ చేస్తామని తెలిపారు.

గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 5లక్షలు తక్షణం కేటాయింపును ప్రకటిస్తూ...నెమలిగుట్ట తండా నుంచి దొంతరలు గుట్ట తండా వరకు బీటీ రోడ్డు, అంగన్వాడీ, మహిళా సంఘం భవనం, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు అంచల వారిగా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దళిత బంధు, రైతు బంధు పథకాలను దళారుల బంధుగా మార్చారని, ఇప్పుడు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి పరీక్షలు వాయిదా వేయాలనే దురుద్దేశంతో వారి జీవితాలతో ఆడుకుని రాజకీయం చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ…

నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందని, మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఈ ప్రాంతానికి స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కేటాయింపు చేశారని అందులో భాగంగా 150 ఎకరాల భూసేకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపతి రెడ్డి, పార్టీ బ్లాక్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ రాం గౌడ్, సంజీవ్ యాదవ్, నాయకులు రాములు,నూర్ పాల్, లక్ష్మణ్,బాల్ రాజ్,దళిత సంఘం నాయకుడు రమేష్ మహారాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story