పశువులకు అడ్డాగా పట్టణ జాతీయ రహదారి

by Kalyani |
పశువులకు అడ్డాగా  పట్టణ జాతీయ రహదారి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలోని జాతీయ ప్రధాన రహదారి పశువులకు అడ్డాగా మారిపోయిందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తిష్ట వేసుకొని సేద తీర్చుకుంటున్న పశువుల మందను బుధవారం మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ సిరాజుద్దీన్ గమనించి పారద్రోలారు. కొంతమంది పశువులను ఇలా రోడ్లపైకి వదిలివేయడంతో ట్రాఫిక్ జాంలు, ప్రమాదాలు జరుగుతున్నాయని, తరచూ రోడ్లపై సంచరిస్తున్న పశువులను గుర్తు తెలియని వాహనాలు ఢీ కొడుతుండగా, రోడ్లన్నీ రక్తసికంగా మారుతున్నాయని ఆయన ఆందోళన చెందారు. పశువుల యజమానులు తమ ఇండ్ల దగ్గరే కట్టడి చేసుకోవాలని, లేదంటే జరిమానా విధించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Next Story