విషాదం మిగిల్చిన విహార యాత్ర.. కారు టైర్ పగిలి యువకుడు మృతి

by Mahesh |
విషాదం మిగిల్చిన విహార యాత్ర.. కారు టైర్ పగిలి యువకుడు మృతి
X

దిశ, అమరచింత: విహార యాత్ర ఓ యువకుని కుటుంబంలో విషాదం మిగిల్చింది. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలానికి చెందిన ఏడుగురు యువకులు మంగళవారం నాడు సరదాగా స్నేహితులతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేసుకుని, జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. విహార యాత్ర ముగించుకుని జూరాల ఎడమ కాలువ పక్కన ఉండే మట్టి రోడ్డుపై వస్తుండగా, ఆత్మకూర్ మండలం మూలమల్ల గ్రామ శివారులో వారి స్కార్‌పియో వాహనం టైరు పగిలి, అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న ఏడుగురిలో రోహన్ (22) అనే యువకుడికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన అంబులెన్స్‌లో ఆత్మకూర్ సీహెచ్‌సి హాస్పటల్‌కు తీసుకు వెళ్లారు. కాగా ఆ యువకుడు చికిత్స అందెలోపే మరణించినట్లు వారు వెల్లడించారు. మిగితా వారు చిన్న చిన్న గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డామన్నారు.Next Story

Most Viewed