వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించండి : Mandakrishna Madiga

by Disha Web Desk 11 |
వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించండి : Mandakrishna Madiga
X

దిశ, సికింద్రాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని కోరారు. బౌద్దనగర్ డివిజన్ పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడారు. 28 ఏళ్లు వర్గీకరణ విషయంలో బీజేపీ తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. రానున్న కాలంలో ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీజేపీ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అనాథల సమస్యలను పరిష్కరించి, అన్ని విధాలా తోడ్పాటును అందించేందుకు నిర్మాణాత్మకమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంతో మంది నేడు అక్రిడిటేషన్ కార్డులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై గుర్తింపు పొందిన సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Next Story