బీఆర్ఎస్‌తో పొత్తుపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌తో పొత్తుపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌తో సీపీఐకు బ్రేకప్ కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలను కమ్యూనిస్టుల చుట్టే తిప్పుతున్నారని, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. కమ్యూనిస్టులే ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారని అబద్ధం చెబుతున్నారని స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్‌లో కూనంనేని మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో ఇది వరకే చాలా సార్లు చర్చలు జరిపామన్నారు.

బీఆర్ఎస్‌తో కుదిరితేనే పొత్తులు ఉంటాయని, లేదంటే సింగిల్‌గానే పోటీ చేస్తామని, ఎవరికీ తలవంచేది లేదని, గౌరవానికి భంగం కలిగితే ఊరుకోమని కూనంనేని చెప్పారు. మా పార్టీలో చర్చలు జరిగాయి.. పోటీ చేస్తే సొంతంగా పోటీ లేదంటే, ఈ ధనస్వామ్య ఎన్నికల్లో పోటీ చేయద్దు అనే తీరులో చర్చలు జరిగాయన్నారు. హుస్నాబాద్, కొత్తగూడెం సీట్ల విషయం ఎన్నికల సమయంలో తేలుతుందన్నారు. పొత్తులు పోత్తులే.. సమస్యలపై పోరాటాలు పోరాటాలే అని స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నిరాశ మిగిల్చిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీల ఊసే ఎత్తకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ సాధించుకోవడానికి పాదయాత్ర చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని ఎందుకు తప్పించారో తెలపాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు గెలవదని విమర్శించారు.

Next Story

Most Viewed