బీఆర్ఎస్ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. మరోసారి ఆయనకే ఛాన్స్!

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. మరోసారి ఆయనకే ఛాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పుడి నుంచే కార్యచరణ ప్రారంభించాయి. కాంగ్రెస్ హాత్ సే హాత్ యాత్ర, నిరుద్యోగ నిరసన ర్యాలీ.. బీజేపీ పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇటీవల జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తున్నారు.

కాగా, ఇవాళ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ఆశ్వీరాద సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ నుండి తొలి ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ నుండి స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున బోయినపల్లి వినోద్ కుమార్ బరిలోకి దిగుతారని కేటీఆర్ హుస్నాబాద్ సభలో ప్రకటించారు.

కేటీఆర్ ప్రకటనతో కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ఉన్న సస్పెన్స్‌కు తెర వీడింది. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్ కుమార్‌ను గెలిపించి.. బండి సంజయ్‌ను ఇంటికి పంపాలని సూచించారు. ఇక, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఓటమి పాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.

Also Read...

కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి.. నెలకు లక్షన్నర జీతం



Next Story

Most Viewed