నేటి నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన

by Rajesh |
నేటి నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా పర్యటనకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 29వరకు పర్యటిస్తారు. కేటీఆర్ అమెరికా అధికారిక పర్యటన ఇది నాలుగో సారి. ఈ నెల 20న 20న శాన్ డియాగో, 21న శాన్ జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్ లో పర్యటిస్తారు. ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈఓలతో సమావేశం అవుతారు. అదే విధంగా పలు కంపెనీలను సందర్శించి ఉత్పత్తి, మురు సరుకు, ధర, మార్కెటింగ్ తదితర వివరాలను తెలుసుకోనున్నారు. అదే విధంగా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. తెలంగాణలో కంపెనీల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు, కల్పించే రాయితీలను సైతం ఆయా కంపెనీలకు వివరించనున్నారు. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టిన పెట్టుబడులు, ఉత్పత్తులను సైతం వివరించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మంత్రి వెంట ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులు సైతం వెళ్లనున్నారు.

Next Story

Most Viewed