KCR నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం ఖాయం:Komatireddy Raj Gopal Reddy

by Disha Web Desk 19 |
KCR నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం ఖాయం:Komatireddy Raj Gopal Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక అవుతుందంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అప్పులు చేస్తూ, భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం ఖాయం అని ఆరోపించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కోకాపేట, బుద్వేల్ భూములను వేలం వేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలకడంపై ఇదంతా తమ పాలన దక్షతకు నిదర్శనం అని ప్రభుత్వం చెప్పింది. తాజాగా ఈ వ్యవహారంపై శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి పై విధంగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ భూములు విక్రయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడుపుతోందంటూ పలువురు నేతలు సెటైర్లు వేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కోకాపేట వేలానికి వచ్చిన స్పందనతో మరికొన్ని ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకే మొగ్గు చూపుతోంది.

Next Story

Most Viewed