ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూయలేదా..? కేటీఆర్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |
ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూయలేదా..? కేటీఆర్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి. రాష్ట్ర విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఇంకెన్నాళ్లు విద్వేషం చిమ్ముతారని ధ్వజమెత్తారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీపై కేటీఆర్ కామెంట్స్‌కు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎన్డీఏ హయంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందని.. ఆ ప్రక్రియ అంతా చాలా సాఫీగా సాగిందని గుర్తు చేశారు. కానీ యూపీఏ హాయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. ఏపీ విభజన సందర్భంగా పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ప్రయోగం జరగలేదా.. పార్లమెంట్ తలుపులు మూసివేయలేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలను కించపర్చలేదని.. కేవలం రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ భవనంలో జరిగిన విషయాలను మాత్రమే చెప్పారని అన్నారు.

Next Story

Most Viewed