ఐడీవోసీలో నీళ్లు లేక ఇబ్బందులు..

by Sumithra |
ఐడీవోసీలో నీళ్లు లేక ఇబ్బందులు..
X

దిశ, ఖమ్మం : ఖమ్మంలో ఐడీవోసీ కార్యాలయంలో నీళ్లు లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఖమ్మం ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సంఘం నేతలను, రైతు అనుబంధం నాయకులను ఆహ్వానించారు. వచ్చిన నాయకులకు అక్కడ భోజన వసతి కల్పించారు. అయితే ఖమ్మం ఐడీవోసీ కార్యాలయంలో ప్రతి రోజూ ట్యాంకులు నింపుకొని నీళ్లను వినియోగించుకుంటారు.

బుధవారం ఐడీవోసీ కార్యాలయానికి అతిధుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ట్యాంక్ లో నింపిన నీళ్లు అయిపోయాయి. దీంతో ఐడీవోసీ కార్యాలయంలో ఉన్న బాత్రూంలో నీళ్లు లేకపోవడంతో అపరిశుభ్రంగా నెలకొన్నాయి. మరో పక్క కంపు వాసనతో ముక్కులు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఐడీవోసీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసినా నీళ్ల ట్యాంకర్లు ఎందుకు అందుబాటులో ఉంచలేదని రైతు సంఘాల నాయకులు అధికారుల పై విరుచుకుపడ్డారు.

Next Story

Most Viewed