రెండు బైకులు ఢీ...ముగ్గురికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
రెండు బైకులు ఢీ...ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, సత్తుపల్లి : పట్టణ పరిధిలోని కిష్టారం ఓసీ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాంధీనగర్ కు చెందిన ఇనపనూరి రోహిత్, కన్నెపోగు వెంకట్ సత్తుపల్లి నుంచి క్రిష్టారం వైపు వెళుతుండగా వై జంక్షన్ సమీపాన సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన యోగేష్, గోపాలకృష్ణ ప్రయాణిస్తున్న బైక్​ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో రోహిత్, వెంకట్, గోపాలకృష్ణ లకు తీవ్ర గాయాలు అవడంతో వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story