ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ

by Kalyani |
ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ
X

దిశ ఖమ్మం సిటీ; తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు సంభవించాయి. 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో బదిలీలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు.

పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ని వెయిటింగ్ లో పెట్టగా,ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్ష్ సురభి ని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఖమ్మం జిల్లాలో మంచి పాలన అందించిన ఐఏఎస్ లుగా వీరి ముగ్గురు గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా వీధులను నిర్వహించిన విపి గౌతమ్ సీనియర్ కావడంతో రాష్ట్రస్థాయి లో పదోన్నతి కలిగే అవకాశం ఉన్నట్లుగా ఉద్యోగ వర్గాలు చెప్పుకొస్తున్నారు.Next Story

Most Viewed