ఆ పథకాలలో అవినీతికి తావు లేదు : ఎమ్మెల్యే కందాళ

by Disha Web Desk 20 |
ఆ పథకాలలో అవినీతికి తావు లేదు : ఎమ్మెల్యే కందాళ
X

దిశ, కూసుమంచి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందించే పథకాలైన గృహలక్ష్మీ, బీసీ బంధు, దళిత బంధు, మైనారిటీ బంధులు పారదర్శకంగా నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు.

ఎవరైనా లంచం ఆశిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తీసుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామని అదేవిధంగా ఇచ్చిన వారికి ఆ పథకాలను అందించకుండా నిలుపుదల చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ ప్రజలు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా వారి మాయమటలకు మోసపోకుండా, స్వచ్ఛందంగా సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవ్వరి ప్రోద్బలం లేకుండా అర్హులైన పేదవారికి సంబంధిత పధకాలను అందజేస్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed