మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలను విడుదల చేయాలి

by Disha Web Desk 15 |
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలను విడుదల చేయాలి
X

దిశ, సత్తుపల్లి : మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని విశ్వశాంతి స్కూల్ నందు మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మటూరు రామకృష్ణ మాట్లాడుతూ 2022 -23 సంవత్సర కాలానికి సంబంధించిన బిల్లులు, కోడిగుడ్ల బకాయిలు తెలంగాణ రాష్ట్రం 9, 10 తరగతుల పిల్లలకు ప్రత్యేక మెనూ చార్జీలు , పెంచిన వేతనాన్ని ఏరియల్స్ తో సహా విడుదల చేయాలని కోరారు.

ఈ నెల 12వ తేదీన పాఠశాలల పున:ప్రారంభ సందర్భంగా పెండింగ్ బిల్లులు, వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే కొన్ని ఏజెన్సీల్లో గత సంవత్సరం కిరాణా , కూరగాయలు, కోడిగుడ్ల షాపుల వద్ద బకాయిలు పెరిగిపోయాయని, దాంతో రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సత్తుపల్లి మండల అధ్యక్షులు తెల్లగారపు రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తడికమల్ల ఏబు, మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు జరీనా, కృష్ణవేణి, కనకదుర్గ ,శుక్కాయ అమ్మ, లక్ష్మి, పూచి సీత పాల్గొన్నారు.


Next Story

Most Viewed