మిషన్ భగీరథ నీటి సరఫరాకు తాత్కాలికంగా"బ్రేక్"

by Kalyani |
మిషన్ భగీరథ నీటి సరఫరాకు తాత్కాలికంగాబ్రేక్
X

దిశ, కామేపల్లి : మిషన్ భగీరథ వాటర్ సప్లై ఈనెల 15, 16 తేదీల్లో తాత్కాలికంగా నిలిచిపోనుందని ఇల్లందు మిషన్ భగీరథ గ్రిడ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధరావత్ బాలాజీ శుక్రవారం తెలిపారు. తోగ్గూడెం వాటర్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున రెండు రోజులు పాటు నీటి సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. మెయింటెనెన్స్ పనులు పూర్తి కాగానే తిరిగి ఈనెల 17 నుండి వాటర్ సరఫరా యధాతధంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని కామేపల్లి, ఇల్లందు, కారేపల్లి, గార్ల, బయ్యారం,టేకులపల్లి మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ స్పెషలాఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, లోకల్ పంప్ ఆపరేటర్లు గమనించి సహకరించాలని ఆయన కోరారు.Next Story

Most Viewed