- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఆర్టీసీ బస్సులో పొగలు

దిశ, అశ్వారావుపేట : ప్రయాణికులతో బస్టాండ్ లోకి వచ్చిన టీఎస్ ఆర్టీసీ బస్సు నుండి హఠాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఆదివారం భద్రాచలం టీఎస్ఆర్టీసీ డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి భద్రాచలం వెళ్తూ అశ్వారావుపేట బస్టాండ్ లోని భద్రాచలం పాయింట్ వద్దకు వచ్చి ఆగింది.
ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా ఇంజన్ కింది భాగం నుండి దట్టంగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, కండక్టర్ లు స్థానిక హమాలీల సహాయంతో పొగ రావడానికి గల కారణాన్ని పసిగట్టి అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించి ఉండొచ్చని ప్రయాణికులు అనుకున్నారు. కొద్దిసేపటికి బస్సులో తలెత్తిన సమస్యను సరి చేసుకుని బస్సు భద్రాచలం వెళ్లింది.