మండలంలో ఇష్టారీతిగా కరెంట్​కట్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

by Disha Web Desk 12 |
మండలంలో ఇష్టారీతిగా కరెంట్​కట్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్​మండలంలో ఎడాపెడా చేస్తున్న కరెంట్​కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సంబురాలు నిర్వహిస్తుంటే రూరల్​మండలంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతున్నది. ఇదేంటని విద్యుత్​అధికారులను అడిగితే ఓవర్‌లోడ్‌తో ఇలా జరుగుతున్నదని సమాధానం చెబుతున్నారు. సహజంగా ఎండాకాలంలో కరెంటు ​వినియోగం అధికంగానే ఉంటుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. తీరా సీజన్​వచ్చాక ఓవర్ లోడ్​పేరుతో ఇష్టారితీన కటింగ్‌లు చేస్తుండటంతో ఆశాఖ అధికారులపై అసహనం వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఎండాకాలం ముగుస్తున్నా అధికారులు సమస్యను అధిగమించకపోవడం గమనార్హం.

ముందస్తు ప్రణాళికేది..?

సీజనల్‌లో అధిక కరెంట్​ వినియోగానికి చెక్​పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు కరెంట్ ​కోతలతో ఇబ్బందులు ఉండవు. సబ్​స్టేషన్ వారీగా గ్రామాల్లో ఓవర్​లోడ్​ జాబితాను రూపొందించుకొని నూతన ట్రాన్స్​ఫార్మర్​లను ఏర్పాటు చేసుకోవడంతో సమస్యకు​ చెక్​పెట్టే అవకాశం ఉంది. కేవలం కరెంట్​ అధికారుల నిర్లక్షంతోనే కరెంట్ కోతలు వస్తున్నాయి. మండలంలోని ప్రధానంగా ఏదులాపురం పరిధిలోని శ్రీరామ్​నగర్, గుర్రలపాడు, పెద్ద తండా, మద్దులపల్లి తదితర ప్రాంతాలతో పాటు, ఆరెంపుల సబ్​స్టేషన్​ పరిధిలోని ఆరెంపుల, బారుగూడెం, ఆరెకోడు, చింతపల్లి తదితర గ్రామాల్లో కరెంట్​ కటింగ్​ వీపరితంగా ఉంది. సమయపాలన లేకుండా కరెంట్​ కటింగ్ చేస్తుంటడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓవర్లోడ్​ ప్రాంతాలను గుర్తించి అక్కడ అధికలోడ్​ గల ట్రాన్స్​ఫార్మర్​లను ఏర్పాటు చేస్తే ప్రజలు ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఇబ్బంది పడుతున్నాం.

శ్రీరామ్‌నగర్‌లో రోజు కరెంట్ కటింగ్​చేస్తుండటంతో ఉక్కపోతల మధ్య జీవనం సాగిస్తున్నాం. అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.- హరి, శ్రీరామ్‌నగర్ కాలనీ

కరెంట్ కోతలు నిజమే..

కరెంట్​కోతలు ఉన్నమాట వాస్తవమే. ఫీజులు కొట్టేస్తుండటంతో ఎల్‌సీ తీసుకోవడంతో కరెంట్ సరఫరా కట్ చేస్తున్నాం. కరెంట్​వినియోగం అధికంగా ఉండటంతో సమస్య తలెత్తుతుంది. ఓవర్ లోడ్​ఉన్న ప్రాంతంలో ట్రాన్స్​ఫార్మర్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులకు ప్రపోజల్ పంపించాం.-క్రాంతి సింహా, ఏఈ, ఏదులాపురం



Next Story