స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో నేలకొండపల్లి వాసి మృతి

by S Gopi |
స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో నేలకొండపల్లి వాసి మృతి
X

దిశ, నేలకొండపల్లి: సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో మండలంలోని ఓ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. నేలకొండపల్లి మండలలోని సుర్దేపల్లి గ్రామానికి చెందిన త్రివేణి(22) అనే సాఫ్టు వేర్ ఉద్యోగి మృతిచెందింది. త్రివేణి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరవ అంతస్తులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అగ్ని కిలలకు తాళలేక వాష్ రూంలోకి వెళ్లి ఆరుగురు దాక్కున్నారు. పొగతో ఊపిరాడక మృతిచెందారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహటీన హైదరాబాద్ వెళ్ళారు. కూతురు మృతిచెందినట్లు తెలుసుకుని గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. దీంతో గ్రామంలో ఆమె ఇంటి వద్ద బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి.Next Story

Most Viewed