రాములోరి పెళ్లికి ముస్లిం పెద్దలు

by Disha Web Desk 15 |
రాములోరి పెళ్లికి ముస్లిం పెద్దలు
X

దిశ , తల్లాడ : తల్లాడలోని వెలుగు ఆఫీస్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణం జరిగింది. ఈ కల్యాణానికి తల్లాడ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్. ఈసుబ్, హాఫిజా దంపతులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఈసారి కూడా వారు పట్టు వస్త్రాలను, తలంబ్రాలు సమర్పించారు. మేళ తాళాలు, డబ్బు వాయిద్యాలతో తీసుకెళ్లి దేవాలయంలో సమర్పించారు. హిందూ, ముస్లిం భాయీభాయి అంటూ ఐక్యతకు ప్రత్యేకంగా వారు తలంబ్రాలను తీసుకెళ్లారు.

కార్యక్రమంలో నేరెళ్ల వెంకటేశ్వరరావు కళ్యాణి, శ్రీకాంత్, శ్రావ్య, కృష్ణ, భాను, సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఏమి చెట్టి వెంకటేశ్వరావు, రాయల నరసరావు, నరాల గోపాల్ రెడ్డి, నరాల వెంకటేశ్వర్ రెడ్డి, దగ్గుల జములా రెడ్డి, సమ్మెట రామకృష్ణ, గుండ్లరాఘవ, అప్పి రెడ్డి, దగ్గుల రాము, ఎస్ కే రఫీ, పఠాన్, జానీ, హక్కుల ప్రభాకర్ రెడ్డి, అక్కల హరీష్ రెడ్డి, ఈలపోలు వెంకట్, మొక్క ఉపేందర్, కోటేరు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed