నిద్రావస్థలో మండల విద్యాశాఖ

by Mahesh |
నిద్రావస్థలో మండల విద్యాశాఖ
X

దిశ, మణుగూరు/అశ్వాపురం: మండలంలోని అశ్వాపురం లో న్యూ వరల్డ్ ప్రైవేట్ పాఠశాల 2 సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. న్యూ వరల్డ్ పాఠశాల యాజమాన్య గుర్తింపును రద్దు చేయాలని పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా సంప్రదించారని సమాచారం.గత 2 సంవత్సరాలుగా పాఠశాల గుర్తింపు లేదని కానీ మండలంలో సజావుగా పాఠశాల నడిచే విధంగా మండల విద్యాశాఖ అధికారి ఎలా నిర్ణయం తీసుకున్నారా కూడా తెలియడం లేదని ఆ పాఠశాల పత్రాల విషయంలో కూడా నకిలీ పత్రాలను సృష్టించి మధ్య వర్తులతో గుర్తింపు పత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి కూడా ఉన్నది.అసలు 2 సంవత్సరాలుగా పాఠశాల గుర్తింపు లేకుండా నిర్వహించినప్పుడు మండల విద్యాశాఖ అధికారి ఆ పాఠశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం,ఎటువంటి పత్రిక ప్రకటనలు కూడా ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దావిస్తుంది.

ఈ విషయమై పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులకు వినిపిస్తే తక్షణమే పాఠశాలకు సీల్ వేయకుండా ఇంకా పాఠశాల నిర్వహించిన తీరు శోచనీయం ఇప్పుడు పాఠశాల యొక్క పాఠశాలలోని విద్యార్థుల రికార్డులు కూడా సవ్యంగా ఉన్నాయా లేవా అని పరిస్థితిలో ఆ పాఠశాల ఉన్నదని,ప్రస్తుత సంవత్సరానికి అడ్మిషన్లపై ఆ పాఠశాలలో కాకుండా మరొకచోట అడ్మిషన్లు చేయిస్తూ తల్లిదండ్రులకు త్వరలో ఆ పాఠశాలను ప్రారంభిస్తామని చెప్తున్నారని తల్లిదండ్రుల ద్వారా తెలిసిన సమాచారం.ఈ 2 సంవత్సరాలలో ఆ పాఠశాలలోని చదివిన విద్యార్థులు చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను ఇచ్చే అధికారం పాఠశాల యాజమాన్యం వారికి ఉన్నదా లేదా అనే సందేహం కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతుంది.ఇలాంటి పాఠశాలను తక్షణమే మూసి వేయించి 2 సంవత్సరాలుగా పాఠశాల గుర్తింపు తీసుకోకుండా, పిల్లల భవిష్యత్తుతో ఆటలాడినందుకు పాఠశాల నిర్వహించినందుకు యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.Next Story

Most Viewed