ఖమ్మంలో మరో సూదిగాడు.. భార్యను హత్య చేసిన ఘనుడు

by Disha WebDesk |
ఖమ్మంలో మరో సూదిగాడు.. భార్యను హత్య చేసిన ఘనుడు
X

దిశ, ఖమ్మం: జిల్లాలో సూది మందు హత్య కలకలం సృష్టిస్తుంది. ముదిగొండ మండలంలో సూది మందు హత్య ఘటన మరువక ముందే మరొక సూది హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా గ్రామానికి చెందిన భిక్షంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అతనికి మొదట మేనకోడలితో వివాహం జరిగింది. వారికి పిల్లలు కలగకపోవడంతో నవీన(24) యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు కలిసి అన్యోన్యంగా జీవనం కొనసాగించారు.

ఈ క్రమంలో నవీనకు మొదటిసారిగా పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చడంతో జులై 30న నగరంలోని శశిబాల హాస్పిటల్ లో డెలివరీ కోసం నవీనను అడ్మిట్ చేశాడు. అదేరోజు నవీన మరో పాపకు జన్మనిచ్చింది. కొద్ది రోజులుగా భిక్షంకు మొదటి భార్యకు మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో నవీనాని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. 30న అర్ధరాత్రి గ్లూకోజ్ లో మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. ఉదయం 4 గంటలకు ఆమె చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో తన భార్య చనిపోయిందని డ్రామాకు తెరలేపాడు. 31న ఉదయం తన బంధువులకు సమాచారం ఇచ్చి బంధువుల సహకారంతో ఆసుపత్రి ఎదుట ధర్నా కొనసాగించాడు. ఆస్పత్రి డాక్టర్లు తమవల్ల చనిపోలేదని చెప్పినప్పటికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వారు రూ. 4 లక్షలు ఇవ్వడంతో ధర్నాని విరమించి చనిపోయిన తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లాడు.

ఆసుపత్రి వైద్యులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా భిక్షమే గ్లూకోస్ బాటిల్ లో మత్తుమందు ఇచ్చి చంపాడని సీసీ ఫుటేజ్ లో కనిపించింది. వైద్యులు ఐఎంఏ అధ్యక్షులు సహకారంతో జిల్లా పోలీస్ కమిషనర్ ను సంప్రదించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టూ టౌన్ పోలీసులు రంగంలో దిగి భిక్షం చేసిన కుట్రను ఛేదించారు. భిక్షంని పోలీసులు అదుపులకు తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ముదిగొండ, ఖమ్మంలో చోటుచేసుకున్న ఘటనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డాక్టర్ల ప్రిపరేషన్ లేకుండా మెడికల్ షాపుల్లో మత్తుమందులు ఎలా ఇస్తున్నారోనేదానిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed