ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా లంక సాగర్

by Sridhar Babu |
ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా లంక సాగర్
X

దిశ, పెనుబల్లి : తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, జాతీయ ఆరోగ్య మిషన్ వారు 2015 స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా 2022 - 2023 ఆర్థిక సంవత్సరానికి గాను మండలం పరిధిలోని లంకా సాగర్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంను ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా ఎంపిక చేశారు. ఆరోగ్య కేంద్రం గదుల శుభ్రత పాటించడం, వ్యాధుల వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడం, కిరమి రహిత భవనం, బయో మెడికల్ వెస్టేజ్ పై మేనేజిమెంట్ తీసుకున్న చర్యలు, ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడంతో కుటుంబ సంక్షేమ ఆరోగ్య మిషన్ కాయకల్ప అవార్డ్ అందించారు. ఉత్తమ ఆరోగ్య కేంద్రం ఎంపిక పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు లంక సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని అభినందించారు.Next Story

Most Viewed