కేసీఆర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు: జగన్

by Disha Web Desk 12 |
కేసీఆర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు: జగన్
X

దిశ బ్యూరో, ఖమ్మం: తెలంగాణలో పరీక్ష పేపర్ లీకుల వరుస ఘటనలు నిరుద్యోగులు, విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది.. ఈ మేరకు అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది... కార్పొరేట్ విద్య సంస్థల కొమ్ముకాస్తున్న కేసీఆర్ వారి ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్స్ లీకు, నిన్న పదోవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీక్, నేడు హింది పరీక్ష పేపర్ లీకు, ఊట్నూర్లో పదోవ తరగతి జవాబ్ పత్రాలు మాయం.. ఇలా రోజుకొకటి చొప్పున లీకులు జరుగుతున్న పట్టించుకోకుండా నిరుద్యోగుల, విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేస్తున్నారని ప్రకటనలో పేర్కొంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా మొత్తం ఆరు పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్న పత్రాలు లీక్ అయిన విషయాన్ని సిట్ తన విచారణలో తేల్చి చెప్పిందని, ఇంత భారీ స్థాయిలో ప్రశ్న పత్రాల లీకేజీ, పదో తరగతి ప్రశ్నా పత్రాలు వరుసగా లీక్ అవుతుండడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యేశ పూర్వకంగా బాధ్యత రాహిత్యం, అలసత్వాని ప్రదర్శిస్తుందని అభిప్రాయపడింది. కేసీఆర్ పాలన పరమైన విషయాలను పక్కన బెట్టి ప్రధాని కావాలనే పగటి కలలు కంటూ ప్రజల ప్రగతిని మర్చి ప్రగతి భవనంలో పార్టీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నాడని పేర్కొంది.. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందే కానీ తగ్గలేదని పేర్కొంది.

2022 లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించారని, ఈ అర్హత పరీక్షలో నాలుగు లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారని, వీరంతా టీఆర్టి నొటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచిన ప్రభుత్వం వాటి ఊసు ఎత్తడం లేదు. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు కూడా గురుకుల పాఠశాల టీచర్ల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్య సంస్థల అనుకూల విధానాలను అమలులో భాగంగానే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్, కేటిఆర్లను భాద్యులు చేస్తూ వారిని శిక్షించాలని, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ప్రజాస్వామిక వాదులంతా ఐక్యమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed