వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర దొంగలు

by Kalyani |
వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర దొంగలు
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ తన సిబ్బందితో ఎర్రగుంట గ్రామంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారులో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా అన్నపురెడ్డిపల్లి పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో చండ్రుగొండ పరిధిలో రెండు దొంగతనాలు చేశారు అని తెలిపారు. అలాగే వారిపై గతంలో గుడివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చామని తెలిపారు.మళ్లీ దొంగతనం చేయటానికి ఇటువైపు రాగా పోలీసు వారు పట్టుకున్నారు. వారి వద్ద ఒక స్విఫ్ట్ కారు, బజాజ్ పల్సర్ బైక్, సుమారు ఒక లక్ష 44 వేల రూపాయలు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ విచారణ అనంతరం నిందితులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది.Next Story

Most Viewed