ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతా

by Disha Web Desk 15 |
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతా
X

దిశ, తల్లాడ : గత పాలకులు అభివృద్ధిని విస్మరించి వెనుకబాటుకు కారణమయ్యారని, తనకు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసే పూచీ తనదని ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లాడ మండలంలోని మల్లారం, బాలంపేట, అన్నారుగూడెం, బిల్లుపాడు, వెంగన్నపేట గ్రామాలలో ఆయన పర్యటించి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. తల్లాడ మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి తాండ్ర వినోద్​రావు తోపాటుగా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజుతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లారం గ్రామంలో ఇంటింటికీ ప్రచారం

నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే మరొక్క మారు నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని, ఆయన సైనికుడిగా మీ ముందుకు వచ్చానని, మీ ఆశీర్వాదం కావాలని కోరారు. అనంతరం బాలపేట్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. తదుపరి అన్నారుగూడెం చేరుకున్నప్పుడు ప్రజలు డప్పుచప్పుళ్లతో, కళాకారులతో కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ గతంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ప్రజలను మోసం చేశారని, ఈసారి అలా మోసపోవద్దని, దేశంలో మచ్చలేని నిష్ణాతుడైన ప్రధానమంత్రి శిష్యుడైన తనకు ఓటు వేయాలని,

వచ్చే ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తే జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం బిల్లుపాడు గ్రాస్తులతో మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల అయోధ్య రామ మందిర కలను సాకారం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ అని అన్నారు. మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తే వచ్చే ఐదు సంవత్సరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించి భారత్ ను తిరుగులేని శక్తిగా తీర్చు దిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవరావు, జిల్లా అధికార ప్రతినిధి పగిడాల మధు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్, తల్లాడ మండల నాయకులు కృష్ణారావు, చౌడ నాగేశ్వరరావు, నరేష్, ఎల్లంకి సుధాకర్, రాయల రమేష్, తొండపు మధుసూదనరావు, రవితేజ, కొమ్మినేని రామారావు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed