అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పినపాక ఎమ్మెల్యే

by Sumithra |
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పినపాక ఎమ్మెల్యే
X

దిశ, మణుగూరు/పినపాక : మండల స్థాయి అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల నాయకులు, అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనుకులకు శంకుస్థాపన చేశారు. ముందుగా పినపాక, సీతంపేట, బోటిగూడెం గ్రామ పంచాయతీలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతన బ్రిడ్జి, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, 1 కోటి 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వైద్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వర్షాకాలం వరద నీరు గ్రామాలలో రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామాలలో ఉన్న కాలువలకు ఇరువైపులా కట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, వైస్ ఎంపీపీ కింది సుబ్బారెడ్డి, నాయకులు కొర్సా ఆనంద్, ఉడుముల రవీందర్ రెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, పరిమి వెంకటేశ్వర్లు, నవ్వాతి శ్రీను, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story