వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఫీల్డ్ విజిట్

by Disha Web Desk 15 |
వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఫీల్డ్ విజిట్
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మూడవ సంవత్సర విద్యార్థులు వ్యవసాయ ఆర్ధిక శాస్త్రం అభ్యాసనలో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న అల్లిగూడెం వ్యవసాయ గిడ్డంగిని మంగళవారం సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శనలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచడంలో గిడ్డంగుల పాత్ర, నిల్వ ఉంచే పద్ధతులు, నిర్వహణ ప్రణాళిక, కీటకాల నుండి ఉత్పత్తుల రక్షణ, వివిధ రికార్డులు నిర్వహణ మొదలగు విషయాలను పరిశీలించారు. గిడ్డంగి ఇంచార్జి నరేష్ గారు ఈ విషయాలను విద్యార్ధులకి విశదీకరించారు. కళాశాల అధ్యాపకులు డా.కృష్ణ తేజ ఈ క్షేత్ర సందర్శనను సమన్వయపరిచారు. అనంతరం సేద్య శాస్త్ర అభ్యాసం లో భాగంగా విద్యార్థులు సేద్య శాస్త్ర అధ్యాపకులు డా.శివ కుమార్ ఆధ్వర్యంలో దమ్మపేట లో గల కృష్ణ సాయి గోశాల, వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకులు శ్రీరామచంద్ర మూర్తి సమగ్ర వ్యవసాయ వ్యవస్థలోని ఖర్చులు, నిర్వహణ, లాభాలు, అంతర పంటలు, సేంద్రీయ సాగు, వివిధ సేంద్రీయ ఉత్పత్తులు, గానుగ నూనె ఉపయోగాలు మొదలగు విషయాలు చర్చించారు.


Next Story

Most Viewed