దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి

by Sridhar Babu |
దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సుమారు 20 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పిలుపునిచ్చారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్దెల రవి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయం రాష్ట్రాన్ని పాలించారని వివరించారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దినదిన అభివృద్ధి సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిందనే ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు , మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతరాములు, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్. లాల్ మహ్మద్, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, పసుపులేటి మోహన్రావు, కాపా మురళీకృష్ణ, కట్టా కృష్ణార్జున రావుతో పాటు నియోజవర్గంలోని 5 మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.Next Story

Most Viewed