దిశ ఎఫెక్ట్...ఆక్రమణ వాస్తవమే

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్...ఆక్రమణ వాస్తవమే
X

దిశ, ఖమ్మం రూరల్​ : దిశ దినపత్రికలో ఎన్నెస్పీ కాలువ కబ్జా..? కబ్జాదారుల్లో కంగారు.. అనే వరుస శీర్షికలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. దిశ కథనాలకు స్సందించిన రూరల్​ తహసీల్దార్​ పి. రాంప్రసాద్​ మంగళవారం రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులు కలిసి సర్వే చేసి హద్దులు గుర్తించి రాళ్లను పాతించారు. మొత్తం 1.13 కుంటల ఎన్నెస్పీ భూమి తేలగా అందులో 5 కుంటల భూమిని పంచాయతీ భవనానికి, 35 కుంటలు ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు

ఇవ్వగా మిగిలిన 13 కుంటల భూమికి హద్దులు గుర్తించిరాళ్లను పాతించినట్లు తహసీల్దార్​ రాంప్రసాద్​ తెలిపారు. రైతులకు 34 కుంటల భూమి ఉందని, వారు దానిలో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకోవాలని, హద్దులు గుర్తించిన భూమిలో ఎటువంటి క్రయవిక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్​ సర్వేయర్​ సతీష్​రెడ్డి, ఆర్​ఐ ప్రసాద్​, వీఆర్​ఏలు ఉన్నారు.


Next Story

Most Viewed