కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెట్టాలి

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెట్టాలి
X

దిశ,నేలకొండపల్లి : గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని దొంగహామీలతో రైతుల్ని మోసం చేస్తే పుట్టగతులు ఉండబోవని, కర్రుకాల్చి వాతపెట్టాలి అని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. బుధవారం మండలంలో ముఠా పురం మీదుగా నేలకొండపల్లి మండల కేంద్రం వరకు రోడ్ షో సాగింది. ఈ సందర్భంగా వినోదరావు కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మండలంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ లో కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ

అభివృద్ధిలో ఖమ్మం అన్ని రంగాల్లో వెనక పడింది అన్నారు. మోడీ హయాంలో ముందుకు సాగుదామన్నారు. అది ఎన్నో రంగాల్లో జిల్లానే కాదు రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడవడానికి ఉపయుక్తం అవుతుందన్నారు. నాకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అని, నా గెలుపునకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నున్నా రవి, ఉపేందర్ గౌడ్, మన్నె కృష్ణ, హనుమంత్ రావు, ఎస్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు రవి రాథోడ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed