సొమ్ము సింగరేణి ది.. సోకు కేసీఆర్ ది..

by Disha Web Desk 20 |
సొమ్ము సింగరేణి ది.. సోకు కేసీఆర్ ది..
X

దిశ, సత్తుపల్లి : సింగరేణి బొగ్గుగనుల వేలం ప్రైవేటీకరణ విషయంలో నరేంద్రమోడీ తీసుకువచ్చిన మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 బిల్లుకు పార్లమెంట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఎంపీలు అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మొత్తం 14 మంది ఎంపీలు మద్దతు తెలిపి సింగరేణి సంస్థ నాశనానికి పూనుకున్నారని కేసీఆర్ సింగరేణి సంస్థ రక్షకుడు కాదని సింగరేణి సంస్థ భక్షకుడని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ సోమవారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు ట్రాన్స్కో జెన్కో విద్యుత్ సంస్థలు బకాయిపడ్డ 18 వేల కోట్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్గొడుతూ సింగరేణి సంస్థ ధనం దుర్వినియోగం చేస్తూ సింగరేణి సొమ్ముతో సీఎం కేసీఆర్ సోకులు పడుతుండని ఈ తతంగం అంతా చూస్తే సొమ్ము సింగరేణి సంస్థది, సోకు కేసీఆర్ ది అన్నట్టు ఉందని మానవతారాయ్ ఎద్దేవా చేశారు.

సత్తుపల్లి వెంగళరావునగర్, ఎన్టీఆర్ నగర్, రేజర్ల, కిష్టారం, కొత్తూరు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ ఇళ్ల బాధితులను ఆదుకోకుండా సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటుని ఆయన విమర్శించారు. ఓవర్ బర్డెన్ పేరుతో సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటు యాజమాన్యాల చేతిలో పెట్టి దోపిడి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ సింగరేణి సంస్థ రక్షకుడు కాలేడని స్పష్టం చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల సంక్షేమానికి ఇచ్చేసంక్షేమ నిధులన్నీ సత్తుపల్లిలో ఖర్చు చేయకుండా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని మానవతారాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించకుండా సంబరాలు చేసుకోవటం అవసరమా అని మానవతారాయ్ ప్రశ్నించారు.


Next Story

Most Viewed