నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం

by Disha Web Desk 15 |
నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : అనుమతి లేనిదే పునాది సైతం తొవ్వనివ్వని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్మాణం చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఎటువంటి అనుమతి లేకుండా నేషనల్ హైవేను ఆనుకొని నిబంధనలకు తూట్లు పొడుస్తూ సెల్లార్ నిర్మాణం చేస్తున్నా ఏ ఒక్క

అధికారి అటువైపు చూసిన దాఖలాలు కనబడడం లేదు.పేద, మధ్య తరగతి ప్రజలు గూడు కట్టుకుంటే అడ్డుపడి ముప్పు తిప్పలు పెట్టే అధికారులకు ఈ సెల్లార్ నిర్మాణం కనిపించడం లేదు. ఈ అక్రమ నిర్మాణంపై అనేకమంది ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story