ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

by Dishanational1 |
ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, వేంసూరు రూరల్: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నాలుగు రోజులపాటు జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. భారతదేశ రైతాంగం ప్రతికకు చైతన్యంగా భావించే ఎద్దుల బల ప్రదర్శనను, పురుషుల కబాడీ పోటీలను నిర్వహిస్తున్నట్లు, ప్రతి ఒక్కరూ తిలకించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. క్రీడల ముగింపు కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు బండి పార్థసారథి రెడ్డి, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్బారావు, కందుకూరు ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి రెడ్డి హరికృష్ణ రెడ్డి , కొత్తూరు ఉమామహేశ్వరరావు జిల్లా గ్రంధాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



Next Story

Most Viewed