'సీఎం సభను విజయవంతం చేయండి'

by Vinod kumar |
సీఎం సభను విజయవంతం చేయండి
X

దిశ, మధిర: మధిర అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు విజయాన్ని కాంక్షిస్తూ.. ఈ నెల 21న మధిర పట్టణంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి భారీ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు.

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మధిర తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మూడోసారి కేసీఆర్‌ను గెలిపించడానికి మధిర లో కమల్ రాజు గెలవడానికి దోహద పడతాయన్నారు. మూడుసార్లు గెలిచిన భట్టి మధిర నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, జడ్పీ చైర్పర్సన్‌గా పదవ చేపట్టిన లింగాల కమల్ రాజు తోనే మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల ను ప్రజలు నమ్మరు అన్నారు. మధిర లో ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లింగాల కమల్ రాజు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి జిల్లా ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చిత్తారి నాగేశ్వరావు, రంగి శెట్టి కోటేశ్వరరావు, మొండితోక జయకర్ రావూరి, శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు జేవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story