ఇటుక దందా ఇష్టారాజ్యం..చదువుకు దూరమవుతున్న బాల కార్మికులు

by Dishanational2 |
ఇటుక దందా ఇష్టారాజ్యం..చదువుకు దూరమవుతున్న బాల కార్మికులు
X

దిశ, ఖమ్మం రూరల్: వారి జేబులు నిండితే చాలు. కార్మికుల జీవితాలు ఏమైనా పర్వాలేదు. వారిని అడిగే వారు అసలు లేరు. వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఖమ్మం రూరల్ మండల వ్యాప్తంగా అడ్డు, అదుపు లేకుండా ఇటుక బట్టీల మాఫియా పై దిశ పత్రిక ప్రత్యేక కథనం.

ఖమ్మం రూరల్ మండల పరిధిలో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు పుట్టగొడుగులల వెలిశాయి. ఇటుక బట్టీల వ్యాపారంతో లక్షలు గడించవచ్చు, అనే ఉద్దేశంతో కొంతమంది అక్రమార్కులు, నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని, పచ్చని పల్లెలతో పాటు, కార్మికుల, బాల కార్మికుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వీరిని చూసి మరి కొంతమంది లాభాలు అధికంగా ఉంటాయని, ఎటువంటి పర్మిషన్లు లేకుండా కొత్త బట్టిలు పెడుతున్నారు. ఇటుక బట్టీలు పెట్టాలంటే సంబంధిత గ్రామపంచాయతీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులను వద్ద నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వారిచ్చే పర్మిషన్లకు అనుగుణంగా ఏ ఒక్క ఇటుక బట్టి ఉండడం లేదు. ఇటుక బట్టి నిర్వహించే ప్రాంతం కచ్చితంగా వ్యవసాయేతర భూమి అయి ఉండాలి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ, బట్టి నిర్వహించే భూమిలో అనేక బోర్లను పర్మిషన్ లేకుండా ఇష్టను రీతిలో తవ్వేస్తున్నారు.

వ్యవసాయ బోర్లకు అక్రమ కరెంటును వాడుతున్నారాని తెలిసింది. ఇటుకను కాల్చడానికి ఉపయోగించే కలపను, సమీప అడవి నుండి అక్రమ మార్గంలో తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. బట్టీలకు తరలించిన కలపతో బట్టీలను కాలుస్తూ పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నారు.పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, నుంచి కార్మికులను తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు తమకు కార్మిక చట్టాలు వర్తించడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం అయితే, వాళ్లకు తినడానికి తిండి , కనీస నివాస సౌకర్యాలు ఉండాలి. అక్కడి నుండి వచ్చేవారు దళారులను నమ్మి మోసపోతున్నారు. దీనివలన మధ్యవర్తుల వ్యాపారం మూడు పూలు ఆరు కాయలను చందగా కొనసాగుతుంది. ఆరు నెలల పాటు సాగే ఈ వ్యాపారంలో పక్క రాష్ట్రాలను నుంచి వస్తున్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

విద్య లేక చిన్న పిల్లలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటుక బట్టీలలో పనిచేసే ప్రతి ఒక్కరికి యాజమాని ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంటుంది. ఇవి కానీ ఇవేమీ బట్టి నిర్వాహకులకు పట్టడం లేదు. ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు. బట్టి నిర్వాహకులు కార్మికులను వారి అవసరం ఉన్నంతవరకు పని చేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇటుక బట్టి నిర్వహించే ప్రాంతంలో.. జీవనానికి సంబంధం ఉండదు. కావున ఎలాంటి ఇబ్బంది వచ్చిన కార్మికుడు ఎవ్వరికి చెప్పుకోలేని దిక్కు పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒరిస్సా , ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన ప్రతి కార్మికుడి వివరాలు చట్టప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పేరు నమోదు చేయాలి. కానీ బట్టి నిర్వాహకులకు ఇవేమీ పట్టడం లేదు. కార్మికులకు కనీస వసతులు, ఉండడానికి ఇల్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు తాగటానికి మంచినీరు, పిల్లలు చదువుకోవడానికి స్కూలు అందుబాటులో ఉండేటట్టు చూడాలి. ఇందులో ఏ ఒక్క సౌకర్యం లేకున్నా, ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed