ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం

by Sridhar Babu |
ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. యుక్త వయసు వారు సరైన అవగాహన

లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎయిడ్స్ సోకిన వారిని చులకనగా చూడవద్దని, వారి పట్ల వివక్ష చూపరాదని తెలిపారు. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ చర్మ వ్యాధుల డాక్టర్ మోహన కృష్ణ రెడ్డి హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ఏమైనా అనుమానం ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సహజీవనం, కలిసి ఉండటం, కలిసి భుజించడం వలన వ్యాధి రాదని, రక్త మార్పిడి, సూదులు, లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుందని తెలిపారు.



Next Story

Most Viewed