ఏసీడీ చార్జీలను వెంటనే ఎత్తివేయాలి

by Disha Web Desk 1 |
ఏసీడీ చార్జీలను వెంటనే ఎత్తివేయాలి
X

సీపీఐ తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి నరేంద్ర కుమార్

దిశా, జూలూరుపాడు: ఏసీడీ పేరుతో ప్రభుత్వం వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి చంద్ర నరేంద్ర కుమార్ అన్నారు.ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏసీడీ పేరుతో మధ్య తరగతి విద్యుత్ వినియోగదారుల జేబులు గుల్లా చేస్తోందన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని ప్రకటించి కనీస విద్యుత్తు 24 గంటలు రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ సామాన్యులపై పెనుభారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీడీ పేరుతో అదనంగా వేస్తున్న విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎస్కే నాగుల మేర, చాంద్ పాషా ,చింతా స్వరాజరావు, తాతా నరసింహారావు, ఎల్లంకి మధు, యాస రోశయ్య, తూముకోటయ్య, గుండు పిన్ని మధు, సిరిపురపు వెంకటేశ్వర్లు, పొన్నకంటి వెంకటేశ్వర్లు, భూక్య హనుమ, భూక శంకర్, చిమట ముత్తయ్య ,ఉదారి నాగయ్య, కొట్టెశీను బడుగు వీరస్వామి, గుడిమెట్ల సీతయ్య, శివకృష్ణ పగడాల, అఖిల్, బర్ల బాబురావు పసుపులేటి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed