ఖరము పాలు గరిటెడైనను చాలు....

by Disha Web Desk 15 |
ఖరము పాలు గరిటెడైనను చాలు....
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు...కడివెడైననేమి ఖరము పాలు అనే వేమన పద్యం అందరికీ తెలుసు. దీనికి విరుద్ధంగా నేడు ఖరము పాలకు ఆవు పాలంటే రెట్టింపు ధర పలుకుతుంది. గాడిద పాలు తాగితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని మన తాతలు ముత్తాతలు చెబుతుంటారు. ఇప్పుడు అదే నిజం అవుతుంది. దీనిని నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. దీంతో మార్కెట్లో గాడిద పాలకు యమ గిరాకీ పెరిగింది. కొత్తగూడెం వారాంతపు సంతలో ఈ గాడిద పాల విక్రయానికి డిమాండ్ పెరిగింది. 100 ఎమ్ఎల్ పాలు సుమారు 200 రూపాయల ధర పలుకుతుంది. ఇవి తాగడం వల్ల విటమిన్- డి, కేలరీలు ఎక్కువగా శరీరానికి అంది పసి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా తయారు అవుతారు. దగ్గు, జలుబు, ఉబ్బసం, ఆర్థరైటిస్ వంటి ఎముకల ఇన్ఫెక్షన్లను నయం అవ్వడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు సైతం గాడిద పాలు వినియోగిస్తారు. గాడిద పాలలోని ఔషధగుణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, వైరస్ల బారిన పడకుండా సహాయపడతాయి. గాడిద పాలలోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుందని, ఇవికూడా తల్లి పాలలా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆవు పాలతో పోలిస్తే కరము పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు, విటమిన్లు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే గాడిద పాలు తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండవని అధ్యయనాల సారాంశం. గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్ శరీరంలో కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. గాడిద పాలలో ఇమ్యూనిటీ వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి. గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు, షాంపూల తయారీలో వాడతారు.

కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? (వీడియో)

Next Story

Most Viewed